Wednesday, November 28, 2012

కుక్క - లెక్క


 టీచర్: నేను నీకు రెండు కుక్కలు, మరి రెండు కుక్కలు మళ్ళీ రెండు కుక్కలు ఇచ్చాననుకో. నీ దగ్గర మొత్తం ఎన్ని కుక్కలు ఉంటాయి?
సంతోష్: ఏడు.
టీచర్: కాదు. ఇప్పుడు చెప్పు. నీకు నేను మొదట రెండు నారింజపళ్ళు, మరి రెండు నారింజపళ్ళు, మళ్ళీ రెండు నారింజపళ్ళు ఇచ్చాననుకో. మొత్తం నీ దగ్గర ఎన్ని నారింజపళ్ళుంటాయి?
సంతోష్: ఆరు!
టీచర్: గుడ్. ఇప్పుడు చెప్పు. నేను నీకు రెండు కుక్కలు, మరి రెండు కుక్కలు, ఇంకా రెండు కుక్కలు ఇచ్చాననుకో. మొత్తం నీ దగ్గర ఎన్ని కుక్కలు ఉంటాయి?
సంతోష్: ఏడు.
టీచర్: రెండేసి కుక్కలు మూడు ఒకటిగా కలిపితే ఏడెలా అవుతాయి బాబూ?
సంతోష్: ఇప్పటికే ఇంటిదగ్గర నాకు ఒక కుక్క ఉంది కదా టీచర్!

Total Pageviews