Wednesday, November 28, 2012

కుక్క - లెక్క


 టీచర్: నేను నీకు రెండు కుక్కలు, మరి రెండు కుక్కలు మళ్ళీ రెండు కుక్కలు ఇచ్చాననుకో. నీ దగ్గర మొత్తం ఎన్ని కుక్కలు ఉంటాయి?
సంతోష్: ఏడు.
టీచర్: కాదు. ఇప్పుడు చెప్పు. నీకు నేను మొదట రెండు నారింజపళ్ళు, మరి రెండు నారింజపళ్ళు, మళ్ళీ రెండు నారింజపళ్ళు ఇచ్చాననుకో. మొత్తం నీ దగ్గర ఎన్ని నారింజపళ్ళుంటాయి?
సంతోష్: ఆరు!
టీచర్: గుడ్. ఇప్పుడు చెప్పు. నేను నీకు రెండు కుక్కలు, మరి రెండు కుక్కలు, ఇంకా రెండు కుక్కలు ఇచ్చాననుకో. మొత్తం నీ దగ్గర ఎన్ని కుక్కలు ఉంటాయి?
సంతోష్: ఏడు.
టీచర్: రెండేసి కుక్కలు మూడు ఒకటిగా కలిపితే ఏడెలా అవుతాయి బాబూ?
సంతోష్: ఇప్పటికే ఇంటిదగ్గర నాకు ఒక కుక్క ఉంది కదా టీచర్!

Friday, July 6, 2012

అలా రాశానా !



హైదరాబాద్ లో ఉద్యోగానికి ఆంధ్రా నుంచి, రాయలసీమ నుంచి, తెలంగాణా నుంచి ముగ్గురు వెంగళప్పలు అర్హత పొందారు. రాత పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలు చూసి రాయలసీమ వెంగళప్ప , ఇలాంటి పనులు మనం చెయ్యలేములే అని మధ్యలోనే వెళ్ళిపోయాడు.మిగతా ఇద్దరు పరీక్ష రాసి ఉద్యోగం ఎవరికి వస్తుందో అని ఎదురుచూస్తున్నారు.


కొంతసేపటి తర్వాత మేనేజర్ వచ్చి , "మీ ఇద్దరు 9 ప్రశ్నలకి సరిగ్గా సమాధానం రాశారు.. ఇద్దరూ ఒకే ప్రశ్నకి తప్పు సమాధానం రాశారు.ఈ ఉద్యోగం ఆంధ్రా వెంగళప్పకి ఇద్దామని నిర్ణయించుకొన్నాం" అని చెప్పాడు.  



తెలంగాణ వెంగళప్ప : అలా ఎలా కుదురుతుంది ? ఇద్దరం ఒకే ప్రశ్నకి తప్పు రాశాం. ఇది హైదరాబాద్ ఉద్యోగం కాబట్టి లెక్క ప్రకారం నాకే రావాలి అన్నాడు.


మేనేజర్ : మేము ఉద్యోగం ఇస్తుంది మీరు రాసిన సరయిన సమాధానాల్ని బట్టి కాదు, మీరు తప్పు రాసిన ప్రశ్న ఆధారంగా నిర్ణయించాం.


తెలంగాణ వెంగళప్ప : ఇద్దరం ఒకే తప్పు చేసాం అంటున్నారు , దాన్ని బట్టి ఎలా నిర్ణయిస్తారు ?


మేనేజర్ : చాలా సులభం ! తప్పు రాసిన ప్రశ్నకి ఆంధ్రా వెంగళప్ప 'నాకు తెలియదు' అని రాశాడు. నువ్వు 'నాకు కూడా తెలియదు' అని రాశావ్. 










డాక్టర్ పేరు


డాక్టర్ జగన్నాధం కొత్తగా హాస్పిటల్ మొదలుపెట్టి , బయట బోర్డ్ మీద పేరు రాయించడానికి వెంగళప్ప అనే పెయింటర్ కి పని అప్పగించాడు.


డాక్టర్ : బోర్డ్ మీద "డా ! జగన్నాధం - Psychotherapist" అని రాయి.
వెంగళప్ప : సరే సార్ !


కొంతసేపటి తర్వాత డాక్టర్ వచ్చి చూస్తే ఇలా వుంది "డా ! జగన్నాధం - Psycho the rapist" 

Thursday, July 5, 2012

నీకూ కుక్కకూ తేడా లేదురా...!!



జంబు: డుంబూ... నీకు ఈత వచ్చారా...

డుంబు: రాదు రా...

జంబు: నీకన్నా కుక్క నయం కదరా... చాలా బాగా ఈదుతుంది

డుంబు: మరి నీకు వచ్చా రా...

జంబు: ఓ.. బ్రహ్మాండంగా వచ్చు...

డుంబు: ఐతే నీకూ కుక్కకీ పెద్దగా తేడా లేదన్నమాట.

Monday, July 2, 2012

వినాయక న్యాయం




కొంతమంది భక్తులు పడవలో వెళ్తుండగా , పడవ ప్రమాదానికి గురయి మునిగిపోసాగింది ..


వాళ్ళు కళ్ళు మూసుకుని వినాయకుడిని ప్రార్థించారు.


వినాయకుడు ప్రత్యక్షం అయ్యి నాట్యం చెయ్యసాగాడు..


భక్తులు : "స్వామీ..మీరు వచ్చి కాపాడతారనుకొంటే , మమ్మల్ని ఈ పరిస్థిథిలో చూసి ఆనందంతో నాట్యం చేస్తున్నారా.. ఇదేమి న్యయం స్వామి" ? 


వినాయకుడు :" వినాయకచవితి తర్వాత మీరు నన్ను నీళ్ళలో వేసి డాన్సులు చెయ్యలేదా.. మీకొక న్యాయం, నాకొక న్యాయమా"? 

పక్కింటి అమ్మాయి






తండ్రి : పక్కింటి అమ్మాయిని చూడరా.. 1st క్లాస్ లో ఎలా పాస్ అయ్యిందో ..


కొడుకు :దాన్ని అలా చూసే నేను ఫెయిల్ అయ్యింది ..


తండ్రి : ఆ...

లిప్ స్టిక్ .. ఫెవీ స్టిక్




తండ్రి ఏంట్రా చింటూ..ఎప్పుడూ లేనిది మమ్మీ మౌనంగా కూర్చుంది ?

చింటూ : మమ్మీ లిప్ స్టిక్ అడిగితే ఫెవీ స్టిక్ ఇచ్చాను..




Friday, June 29, 2012

ప్రేమ..ధనం..విజయం


ఒక మహిళ ఇంటి బయటకి వచ్చేసరికి, ఇంటి ముందు తెల్లటి పెద్ద గడ్డాలతో  ముగ్గురు ముసలివాళ్ళు నిలబడి వున్నారు. వాళ్ళెవరో ఆమెకు గుర్తు రాలేదు.


"మీరెవరో నాకు గుర్తుకు రావటంలేదు..చూడబోతే బాగా ఆకలిగా వున్నట్లున్నారు. దయచేసి లొపలికి వచ్చి ఏమైనా తినండి" అంది.


"మీ అయన ఇంట్లో వున్నాడా" అని ఆడిగారు. 
"లేదు.. బయటకి వెళ్ళారు" అంది.
"అయితే మేము లోపలికి రాలేము" అని బదులిచ్చారు వాళ్ళు. 



సాయంత్రం వాళ్ళాయన ఇంటికి రాగానే , ముసలి వాళ్ళ గురించి జరిగింది చెప్పింది.


"పోయి వాళ్ళని లొపలికి రమ్మని చెప్పు".


ఆమె బయటకి వెళ్ళీ వాళ్ళని లోపలికి ఆహ్వానించింది.


"మేము ముగ్గురం ఒకేసారి కలిసి లోపలికి రాము" బదులిచ్చారు వాళ్ళు.
"ఎందుకని ? " అని ప్రశ్నించింది.



వాళ్ళలో ఒకాయన తన పక్కనున్న వాళ్ళలో ఒకతన్ని చూపిస్తూ, ఇతని పేరు 'ధనం", ఇంకొకతన్ని చూపిస్తూ, ఇతని పేరు "విజయం" , నా పేరు "ఫ్రేమ".. ఇప్పుడు మీ అయన్ని అడిగి మాలో ఎవరు లోపలికి రావాలో చెప్పండి, అని చెప్పాడు. 


ఆమె లోపలికి వెళ్ళి తన భర్తతో వాళ్ళు  మి చెప్పారో చెప్పింది. ఆయనకి మహదానందం కలిగింది. 


"ఒకరే రావాలి కాబట్టి మనం ధనం ని పిలుద్దాం.. ఇల్లంతా సంపందతో నిండుతుంది." అన్నాడు.  


ఆమె తనతో విభేదించింది. ఏమండీ! మనం విజయాన్ని ఎందుకు పిలవకూడదు ? అని అంది.


వాళ్ళ మాటలు వింటున్న కూతురు "మనం ప్రేమని పిలుద్దాం..ఇల్లంతా ప్రేమతో నింపేద్దాం !" అని చెప్పింది.


"మనం మన అమ్మాయి చెప్పిన దాని ప్రకారం పోదాం" అని భర్త భార్యతో అన్నాడు.


 "వెళ్ళి ప్రేమని లోపలికి మన అతిధిగా ఆహ్వానించు" 


ఆమె బయటకి వెళ్ళి ఆ ముసలి వాళ్ళతో "మీలో ప్రేమ ఎవరు ? దయచేసి లోపలికి వచ్చి మా ఆతిధ్యం స్వీకరించండి".


ప్రేమ లేచి లోపలికి వెళ్తుండగా, మిగతా ఇద్దరు అతణ్ణి అనుసరించసాగారు.
ఆమె ఆశ్చర్యంతో "నేను ప్రేమని మాత్రమే పిలిచాని...మీరిద్దరు ఎందుకు వస్తున్నారు" అంది.


దానికి వాళ్ళు ఇలా బదులిచ్చారు ."మీరు ధనాన్ని కాని, విజయాన్ని కాని పిలిచినట్లయితే ..మిగతా ఇద్దరం బయటే వుండేవాళ్ళం.. కాని మీరు ప్రేమని పిలిచారు, ప్రేమ ఎక్కడ వుంటే మేము ఇద్దరం కూడా అక్కడే వుంటాం".   


ప్రేమ ఎక్కడ వుంటే అక్కడే ధనం, విజయం వుంతాయి. కాబట్టి జీవితంలోకి ప్రేమని ఆహ్వానించడం మర్చిపోవద్దు..అప్పుడే జీవితం ధనం, విజయంతో నిండుతాయి. 


Wednesday, June 27, 2012

ఎలా చచ్చావ్ ?





నరకంలో ఓ క్యూలో నిలబడ్డ ముగ్గురు మాట్లాడుకోసాగారు..

"నువ్వెలా మరణించావు?"

"ఏముంది... నేను క్యాంప్ నుంచి హఠాత్తుగా ఇంటికొచ్చేసరికి మా ఆవిడ ఎంత సేపటికి తలుపు తీయలేదు. దాంతో ఆమె శీలం మీద అనుమానం వచ్చి... ఇల్లంతా వెతికితే వాడు కనపడలేదు. దాంతో కోపం వచ్చి బట్టల పెట్టి నెత్తి ఇంట్లోంచి బయిటకు విసిరేసాను..."


అనగానే రెండవ వాడు ఆపి...

"అరె...ఆ పని చేసింది నువ్వా... మీ ఇంటి ప్రక్క నుంచి రోడ్డు పైకి వెళుతున్న నా నెత్తి మీద ఆ బట్టల పెట్టె పడి తల పగిలి చచ్చాను చెప్పాడు..."


అప్పుడు మొదటి వాడు... "దాంతో..నన్ను ఉరి తీస్తే ఇక్కడికి వచ్చాను" అన్నాడు


మూడో వాడు కలిపించుకుని....


"ఆ బట్టల పెట్టిలో ఉన్న నేను మరణించాను" అన్నాడు..మెల్లిగా..

ఎదురింటి కుర్రాడు !



"ఏమండి... ఎదురింటి మేడమీద గదిలో అద్దెకున్న కుర్రాడు నన్నే తెగ చూస్తున్నాడండి... మన కిటికీకి కర్టెన్ అయినా కొనుక్కురండి..." అంది భార్య.

"నిన్ను సరిగా చూడనివ్వవే...వాడే తన కిటికీలకు కర్టెన్లు కొనుక్కుంటాడు.." అన్నాడు భర్త ఎంతో నమ్మకంగా.

టైం దాటిపోయింది..




"నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేనెంత మూర్ఖుడ్నో అప్పట్లో నాకు తెలియదు..." భర్త కోపంగా అరిచాడు.

"నాకు తెలుసు కాని అప్పటికే శుభలేఖలు అచ్చేసారు... కాబట్టి నేనేం చేయలేకపోయాను..." నిట్టూర్చింది ఆమె..

వేలం



బస్సు వెళ్తోందిహఠాత్తుగా కనకరావు కేకపెట్టాడు.

"
బాబూ.. నా పర్సు పోయిందిదాన్లో పదివేల రూపాయలున్నాయినా పర్సు నాకిస్తే వారికి వంద రూపాయలిస్తానుఏడుస్తూ అన్నాడు.

"
నాకిస్తే ఐదొందలిస్తానుమరో వ్యక్తి అరిచాడు.

"
నాకిస్తే వెయ్యి"

"
నాకిస్తే రెండు వేలు..."

"
నాకిస్తే నాలుగు వేలు..."

"
అసలెవ్వరికీ ఇవ్వకుంటే మొత్తం నావేగాఅన్నాడొక ప్రయాణీకుడు నాలుక కరుచుకుంటూ.

బాక్సింగ్





ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి.

"
 కొట్టు... కొట్టు.... దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలిఅని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి.
"
మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?" అడిగాడు పక్కనున్న వ్యక్తి.
"
కాదండీనేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్నిచెప్పాడు దంతనాధం

చేత్తో ఎత్తుకొని వెళ్లాల..!!



ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో కొత్తగా ఎస్కలేటర్‌ని పెట్టారు.

పక్కనే బోర్డుమీద ఇలా రాసి ఉంది.


ఎస్కలేటర్ మీదకెళ్లదల్చుకున్నవాళ్లు కుక్కల్ని చేత్తో ఎత్తుకొని పట్టుకోవాలి.”


పైఫ్లోర్‌కి వెళ్లాలనుకున్న ఒకాయన అది చూసి ఇదెక్కడి గొడవరా బాబు!


ఇప్పుడు కుక్కని వెతికి తెచ్చుకోవాలా! అనుకుంటూ వీధిలోకెళ్లాడు కుక్కనువెతకడానికి.”

Thursday, June 21, 2012

నసీరుద్దీన్ కథలు - గాడిదల పంపకం


ముగ్గురు వ్యక్తులు వాళ్ళదగ్గర ఉన్న డబ్బు తో  పదిహేడు  (17) గాడిదలు  కొన్నారు.  దానికై       మొదటివాడు  సగం,  రెండోవాడు  మూడోవంతు,  మూడోవాడు  తొమ్మిదో  వంతు  పెట్టుబడిగా  పెట్టారు.  వాటిని  వాళ్ళు ఆ  ప్రకారంగానే  పంచుకోవాలనుకున్నారు.  దానిప్రకారం  కొన్న గాడిదలలో  సగం  మొదటి వాడికి,  మూడో వంతు  రెండో  వాడికి,   తొమ్మిదవ వంతు  మూడవ వాడికీ  రావాలి.
అలా చూస్తే  మొదటి వ్యక్తి కి (ఎనమిదిన్నర)  8 1/2  గాడిదలు,  రెండవ అతనికి   5 2/3   (ఐదూరెండూ బై మూడు  గాడిదలు),  మూడో అతడికి   1 8/9 (ఎనిమిదీ బై తొమ్మిది  గాడిదలు)   రావాలి.   ఇలాంటి పంపకం  సాధ్యం కానిది. గాడిదలను ముక్కలుగా కోసి తీసుకోవడం  వాళ్ళకి  నచ్చలేదు.   పరిష్కారంకోసం  కాజీ  దగ్గరకు  వెళ్ళారు  వాళ్ళు.

కాజీ కి ఎంతగా  ఆలోచించినా పరిష్కారం తట్టలేదు.  ఆ సమస్య   కు  మౌల్వీ నసిరుద్దీన్ మాత్రమే  పరిష్కారం  చూపగలడు  అనుకుని  నసిరుద్దీన్ కి  కబురు చేసాడు.

నసిరుద్దీన్  తన  గాడిదను  ఎక్కి   అక్కడికి  వచ్చాడు.  వాళ్ళు చెప్పింది,   కలిగిన   సమస్య  అంతా విని.  ఆ  పదిహేడు  గాడిదలకు  తన  గాడిదను  కలిపి  పంపకం  మొదలెట్టాడు.   అతడి  గాడిదతో  కలిపి  అవి  పద్దెనిమిది  అయ్యాయి (18).  వాటిల్లో  సగం   తొమ్మిది  (9)  గాడిదలను  మొదటి వాడిని  తీసుకోమని  చెప్పాడు.

సాబ్ మీ  గాడిద  మాకు ఇవ్వడమేమిటి?  మా సమస్య కోసం మీరు గాడిదను  పోగొట్టుకోవటం  మాకు  ఇష్టం లేదు  అన్నారు  ఆముగ్గురూ.

నా గాడిదను  ఇచ్చేంత తెలివితక్కువ వాడిని  కాను.  మీరు ముందు మీ వాటాలు తీసుకొండి  అంటూ  ఇలా పంపకం  చేశాడు.
మొదటి వాడు సగం  డబ్బు  పెట్టేడు గనుక  ఉన్న మొత్తం  గాడిదలలో  సగం  వాడికి  రావాలి.  మొత్తం  18  గాడిదలలో  సగం  9  వాడికి.

రెండో వాడికి  మూడో వంతు వాటా రావాలి  అంటే    18 గాడిదలలో  మూడోవంతు  6  కనుక  వాడికి   6 గాడిదలు  ఇచ్చేశాడు.
ఇక చివరి వాడి పెట్టుబడి  తొమ్మిదో  వంతు.  మొత్తం  గాడిదలలో  తొమ్మిదో వంతు రావాలి.  18  లో తొమ్మిదో వంతు  2  కనుక  2  గాడిదలు  అతడికి  ఇచ్చేశాడు.

అలా  మొదటి వాడికి 9   రెండోవాడికి   6  మూడోవాడికి  2  మొత్తం   కలిపితే 17   గాడిదలు  లెక్క సరిగ్గా సరిపోయింది.  అందరూ తమకు రావలసిన  దానికంటే  ఎక్కువే  వచ్చిందని  ఆనంద పడ్డారు. గాడిదలను  ముక్కలు  చేసే పని లేనందుకు  హమ్మయ్య అనుకున్నారు.

అలా  అందరికీ  పంచగా  చివరికి  మిగిలిన  తన  గాడిదపై  ఎక్కి నసీరుద్దీన్  వెళ్ళాడు.

Wednesday, June 13, 2012

అనుభవించావ్


వినయ్ బాబు మరణించాడు.


దూతలు అతణ్ణి స్వర్గానికి తీసుకెళ్ళారు.వినయ్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.


"ఓహ్.. స్వర్గలోకం! ఏంటి నేనంత పుణ్యం చేసుకొన్ననా..? అసలు పాపాలే చెయ్యలేదా?.." అడిగాడు దూతల్ని.


"ఎందుకు చెయ్యలేదు... అసలు నిన్ను నరకానికే తీస్కెళ్ళాలి! కాని నువ్వు చేసిన పాపాలన్నిటికి శిక్షని భూలోకంలోనే మీ ఆవిడతో కాపురం చేస్తున్నప్పుడే అనుభవించావ్. అందుకే నిన్ను ఇక్కడకు తీసుకొచ్చాం!".
  

పోస్టులో కనుక



ఓ పత్రికాఫీసుకి పోస్టులో ఓ కవిత వచ్చింది. కవిత శీర్షిక "నేను ఎందుకు బ్రతికున్నాను ?"


ఆ కవిత చదివిన పత్రికా సంపాదకుడు ఆ వర్ధమాన కవికి ఇలా జవబు పంపాడు.


"నీ కవితను పోస్టులో పంపావు కనుక !"


Friday, June 8, 2012

ప్రేమ మధురం !!

మోసపోయానురా ....!



వినయ్: కండక్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుని మోసపోయానురా ............!

నవీన్: ఏమయ్యిందిరా?

వినయ్: సగం కట్నమే ఇచ్చి, మిగతాది వివాహ పత్రిక వెనుక రాసిచ్చాడురా............!

నువ్వే ఎక్కువ!




బాబు: ఇలా మనం పార్కులో కబుర్లు చెబుతూ ఈ చిప్స్ తింటుంటే నీకే మనిపిస్తోంది?

శిల్ప: నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తోంది!

చీకటి యుగం

అప్పారావు: ఒరేయ్ సుబ్బారావు! మధ్యయుగాన్ని చీకటి యుగం అని కూడా పిలుస్తారెందుకు?

సుబ్బారావు: అప్పుడు కరెంటు లేదు కదరా.............!

బేగాన్...పారగాన్

అంతా రాదండీ !

సిమ్ కార్డ్ మార్చేస్తా !

మీరు కనిపెట్టారా ?


బఠాణీ ప్రేమకథ


కంట్లో పట్టుచీర


కుక్క చూపు




సరిత: (మమతతో) "అదేమిటి వదిన  మీరు పెట్టిన స్వీట్స్ తింటూవుంటే మీ కుక్కపిల్ల నేను పట్టుకున్న పళ్ళెం వైపు అదేపనిగా చూస్తున్నది."

మమత:(సరితతో) "చూడదు మరి, నువ్వు పట్టుకొని తింటున్న పళ్ళెం దానిదేగా మరి"!

పెళ్ళి - పగ



శ్వేత:"మన కుటుంబానికి ఇంత అన్యాయము చేసిన ఆ వినయ్గాడిని చంపి పగ తీర్చుకుంటా నాన్నా!"  పిడికిలి బిగించి శపథం చేసింది శ్వేత వాళ్ళ నాన్న రాఘవరావుతో.

రాఘవరావు:"ఒకేసారి చంపకు.........పెళ్ళిచేసుకో.............ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు" చెప్పాడు వాళ్ళ నాన్నా అమ్ములుతో.

కుక్క పారిపోయింది

ఎంతమందో...

వెయిటింగ్ రూం

బంధువు

పొదుపు

ఎ.టి.ఎం

నీకు 18.. నాకు 22


Wednesday, June 6, 2012

కానరాని చీకటిలో వదిలేయకు



కానరాని చీకటిలో వదిలేయకు..

దిక్కుతోచని ఎడారిలో ఒంటరిని చేయకు..

తనువు గాయపడితే బాధ లేదు..

మనసు గాయపడితే మందు లేదు..

నిన్ను చూడనిదే మనసు నిలవదు..

నీకు దూరమయితే ప్రాణం నిలవదు.

జీవన ప్రయాణం


జీవన ప్రయాణం లో ప్రతి కలయిక ఒక విడిపోవటానికి నాంది
                                                           ..... అలాగని ప్రయాణం ఆగిపోకుడదు.

అడవిలో వెంగళప్పలు



ఇద్దరు వెంగళప్పలు అడవికి వెళ్ళి తప్పిపోయారు. ఎలా బయటపడాలో అని ఆలోచిస్తుండగా సింహం గాండ్రిస్తూ మీదకు వచ్చింది. 


మొదటివాడు మట్టితీసి సింహం కళ్ళల్లో కొట్టి పరిగెత్తుతున్నాడు. రెండవవాడు అక్కడే నిలబడి చూస్తున్నాడు. 


మొదటివాడు ఆగి రెండవవాడితో 'నువ్వు ఎందుకు పరిగెత్తటంలేదు ' అని అడిగాడు. 


దానికి రెండవవాడు 'సింహం కళ్ళల్లో మట్టి కొట్టింది నువ్వు..నేనెందుకు పరిగెత్తాలి ' అన్నాడు.   

సర్దార్జీల దొంగతనం



కొంతమంది సర్దార్జీలు కలిసి బ్యాంక్ దొంగతనానికి వెళ్ళారు..


అక్కడ వాళ్ళకి డబ్బు బదులు కొన్ని ఎర్రటి బాటిల్స్ కనిపించాయి. డబ్బు దొరకక పోయినా కనీసం రెడ్ వైన్ (Red Wine) అయినా దొరికింది అనుకొని బాగా తాగేసి వెళ్ళిపోయారు. 


మరుసటి రోజు న్యూస్ పేపర్లో  ఇలా వచ్చింది : 'బ్లడ్ బ్యాంక్ లో దోపిడి'     

Tuesday, June 5, 2012

కీ బోర్డ్



పుల్లయ్య కొత్తగా సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు.


మొదటి రోజే బాగా పొద్దు పోయే వరకు పని చేస్తూనే వున్నాడు. బాస్ సంతోషపడిపోయి 'ఏం పుల్లయ్యా .. బాగా కష్టపడుతున్నావ్ .. ఏం చేసావ్ రోజంతా" అని అడిగాడు. 


దానికి పుల్లయ్య  " కీ బోర్డ్ లో అక్షరాలు(Alphabets) ఒక వరుసలో లేవు .. అన్నిటిని సరిచేస్తున్నాను" అన్నాడు. 

పెళ్ళైన మగవాళ్ళకు మాత్రమే


ఓ కంపెనీలో అందరూ మగాళ్ళను, అందునా పెళ్ళైన వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటున్నారు. పైగా ఆడవాళ్ళు అర్హులు కాదంటూ నోటిఫికేషన్‍లో రాయడంతో మండిపడ్డ మహిళా సంఘాలు ధర్నా చేశాయి. అసలు విషయం కనుక్కుంటే ఆ కంపెనీ యజమాని ఒక మహిళ. ఈ విషయం తెలిసిన మహిళా సంఘం నేతలు మరింత కోపం కలిగింది. ఆ యజమానిని ఈ విధంగా కోపంగా ప్రశ్నించారు "ఒక మహిళ అయ్యుండీ ఏమిటా నోటిఫికేషన్?"


"అబ్బే... మాకే విపక్షా లేదండి. ఇది ఇప్పుడిప్పుడే పైకొస్తున్న కంపెనీ. చెబితే వినేవాళ్ళు, ఆదేశాల్ని తక్షణం పాటించేవాళ్ళు, కోప్పడ్డా ఎదురుతిరగనివాళ్ళు కావాలి మాకు. అన్నిటికంటే ముఖ్యంగా ఆఫీస్ అవర్స్ అయిపోగానే తక్షణం ఇంటికి వెళ్ళాలనిపించకూడదు." అసలు విషయం చెప్పింది అధినేత.

ఇచ్చట పెళ్ళికొడుకులు అమ్మబడును

హైదరాబాదులొ ఈ మధ్య ఒక కొత్త mall తెరిచారు. ఇచ్చట పెళ్ళి కొడుకులు కూడా అమ్మబడును అని ప్రకటనలు ఇచ్చారు (అవును సరిగ్గా పెళ్ళైన కొత్తలో సినిమాలో లాగానే). కాకపోతే కొన్ని షరతులు పెట్టారు, అవి ఏమిటంటే:
  • అమ్మాయిలు మా mallకి ఒక్కసారి మాత్రమే అనుమతింప బడుతారు
  • పెళ్ళి కొడుకులని వారి వారి హోదా, రుచులు, అభిరుచులకు తగ్గట్లు వివిధ అంతస్థులలో వర్గీకరించబడ్డారు. ఏ అంతస్థులో పెళ్ళి కొడుకునైనా మీరు ఎన్నుకోవచ్చును. ఆ అంతస్థులో నచ్చకపోతే మీరు మరో అంతస్థుకి వెళ్ళవచ్చు. కాకపోతే మీరు వెనక్కి తిరిగి రావటానికి అస్కారము లేదు, చివరి అంతస్థు నుంచి బయటకు పోవడం తప్ప.
ఇదేదో బావుందే చూద్దామని ఒక అమ్మాయి mallకి వస్తుంది. అంతస్థులవారీగా ఈ విధంగా సూచనలు ఉన్నాయి.

మెదటి అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు.

రెండవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు.

మూడవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు.

అద్భుతం!! అని అనుకుంటూ ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళింది ఆ అమ్మాయి.

నాలుగవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు. ఇంటి పని, వంట పనిలో కూడా సహాయ పడతారు.

"ఆహా !! ఈ mall చాలా బావుందే. ఈ అంతస్థులో నాకు కావలసిన వరుడు దొరుకుతాడు అని అనుకున్నది.

 అలా అనుకున్న మరు క్షణమే ఇంకా పైకి వెళ్తే ఎలాంటి వాళ్ళు ఉంటారబ్బా!! అని అనుకొని తరువాతి అంతస్థుకి వెళ్తుంది".

అక్కడి సూచన ఇది:
"మీతో కలిపి ఈ అంతస్థుకి చేరుకున్నవారి సంఖ్య : 61,397. ఈ అంతస్థులో పెళ్ళికొడుకులు లేరు. ఆడవాళ్ళని మెప్పించడం అసాధ్యం."

ఇద్దరూ దొంగలే


ఇద్దరు స్నేహితులు పందెం పెట్టుకొని టెన్నిస్ ఆడుతున్నారు. ఆట చివరికొచ్చాక బంతి కనిపించకుండా పోయింది. కాసేపు వెతికాక- "బాల్ లేదు కాబట్టి ఆట క్యాన్సిల్" అన్నాడు ఓడిపోయేట్టున్న రాము.

"ఇదిగో దొరికింది" తన జేబులో బంతిని పడేసి అరిచాడు సోము.
"బోడి యాభై రూపాయల కోసం నన్ను మోసం చేస్తావా?"

"నిజంరా నాకు దొరికింది"
"ఎలా దొరుకుతుంది? నేను దానిమీద నిల్చుంటే?"

Thursday, May 31, 2012

గవర్నమెంట్ బుద్ధులు


"ఈ మధ్య మన చంటాడికి అన్ని మీ బుద్ధులే వస్తున్నాయండీ " అంది మంగ.

"ఏం చేస్తున్నాడు ?" ఆశ్చర్యంగా అడిగాడు గవర్నమెంట్ ఉద్యోగి అయిన అప్పారావు.


" లంచం ఇవ్వందే ఏ పని ఆఖరుకి భోజనం కూడా ఫ్రీ గా చెయ్యడం లేదు.పగటి పుట స్కూలులో బెంచీ ముందు కూర్చోని హాయిగా పడుకుంటునాడట. మాస్టారు ఏం అడిగినా తెలీదు తెలీదు అని విసుక్కుంటున్నాడట.ప్రోగ్రెస్ రిపోర్ట్ పై దొంగ సంతకాలు కూడా పెడుతున్నాదట " అసలు సంగతి చెప్పింది మంగ.

పెళ్ళి కష్టాలు


"ఇదివరకు వస పిట్టలా గడ గడ వాగుతుందే వాడివి. ఇప్పుడేమిటి సైలెంట్ గా వుంటున్నావు ?" ఆశ్చర్యంగా అడిగాడు వెంగళ్రావు.

" ఈ మధ్యనే బోలెడు కట్నం తీసుకొని పెళ్ళి చేసుకున్నాను. ఇంక పెళ్ళాం ముందు నోరు విప్పడం కూడానా నా బ్రతుకుకి ? అసలు సంగతి విచారం గా చెప్పాడు తాతారావు.

బ్యాంకు సంబంధం


"బ్యాంకు వాడి కూతురిని పెళ్ళి చేసుకోవడం చాలా తప్పయిందిరా !" విచారం గా అన్నాడు సూరి.
"ఏమయ్యింది ? మంచి కుటుంబం , బ్యాంకు సంబంధం , ఇక కట్న కానుకలకు లోటు వుండదని అంటూ ఎగిరి గంతేసి చేసుకున్నావుగా పెళ్ళి ?" అడిగాడు రాము.
" అంతా నా ఖర్మకు వచ్చింది.కట్నం గా ఇచ్చిన ప్రతీ వస్తువుపై గోపాలం గారి ఆర్ధిక సహాయంతో అని రాయించి మరీ ఇస్తున్నాడు మా మామగారు. ఇంటికి వచ్చే వాళ్ల ముందు తలెత్తుకోలేకపోతున్నాను" ఏడుపు ముఖం తో అసలు సంగతి చెప్పాడు సూరి.

ఎంత ప్రేమో ...


" నేనంటే నా భార్యకు ఈ మధ్య ఎంతో ఇష్టం పెరిగింది." గర్వంగా అన్నాడు రాజు
"ఎలా చెప్పగలవు ?" అడిగాడు గోపి.
"అర్ధ రాత్రి ఒంటి గంటకు ఇంటికి వస్తున్నా అంట్లు తోమేందుకు వేడి నీళ్ళు పెట్టి ఇస్తుంది.బొగ్గుపొడికి బదులు నిర్మా ఇవ్వడం మొదలు పెట్టింది.బట్టలు ఉతికెందుకు సబ్బులో నానేసి రెడిగా వుంచుతుంది. అన్నం తినదానికి నేనెంత కష్టపడతానో అని ఏమీ మిగల్చకుండా అని మొత్తం తినేసి గిన్నెలు ఖాళీ చెసేస్తుంది" అసలు సంగతి చెప్పాడు రాజు.

డాక్టర్ దైవాధీనం



" ఈ ఆపరేషన్ థియేటర్లో పూల దండ ఎందుకు పెట్టారు సార్ ?" ఆదుర్దాగా అడిగాడు చిన్నారావు.
" ప్రాక్టీస్ మొదలెట్టిన దగర్నుంచీ నేను చేస్తున్న మొదటి ఆపరేషను ఇది.సక్సెస్ అయితే దేవుడికి వేస్తాం. ఫెయిలయితే నీకు వేస్తాం" తాపీగా కళ్ళజోడు సవరించుకుంటూ అన్నాడు డాక్టర్ దైవాధీనం.

పచ్చడి బండ


ఎందుకే ఈ పచ్చడి బండను షో కేసులో పెట్టావు ? ఏమిటి దాని ప్రత్యేకత ? " అడిగింది రాజి.
" నేను కాపురానికి వచ్చిన వారం రోజుల లోనే ఈ పచ్చడి బండకు గుద్దుకొని పడిపోయే మా అత్తగారు టపా కట్టేసింది.నాకు అత్త పోరు లేకుండా చేసింది. అందుకే ఈ పచ్చడి బండ అంటే నాకెంతో ఇష్టం. దానిని అపురూపం గా దాచుకున్నాను." గర్వం గా చెప్పింది రేఖ.

Monday, May 28, 2012

ఓ తాగుబోతు ప్రేమలేఖ


 

ఒక తాగుబోతు ప్రేమలో పడ్డాడు.
అతను తన ప్రియురాలికి ఇలా లవ్ లెటర్ రాశాడు.

నీ మాట జిన్
నీ నవ్వు రమ్
నీ నడక వోడ్కా
నీ చూపు విస్కీ
నీ మెడ బీర్ బాటిల్


ఓ ప్యార్
నువ్వు నా పాలిట బార్

బెండకాయ కూర


"ఈ రోజు మీ ఇంట్లో బెండకాయ కూర చేశారు కదూ వదినా?"

"అరె! అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగారు?"

"రాత్రి మా దొడ్లో బెండకాయలు ఎవరో దంగవెధవలు కోసుకెళ్ళార్లే"

పుస్తకం


"అదేంట్రా... రెండూ ఒకే రకం పుస్తకాలెందుకు కొన్నావు?" గిరిని అడిగాడు శ్రీపతి.

"ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్లే అని రాసుంది. అందుకే రెండు కొన్నాను" చెప్పాడు గిరి.

Total Pageviews