Tuesday, December 9, 2008

నా గురించి ...

^♥^ విరిసీ విరియని తెల్లగులాబీ లాంటిది నా నవ్వు ^♥^

^♥^ తొలి సంధ్యలో భానుడి కిరణాల్లాంటిది నా చూపు ^♥^

^♥^ ఉదయాన్నే వికసించే కలువపద్మం లాంటిది నా మనసు ^♥^

^♥^ వేకువజామున పక్షుల కిలకిలరావాల్లాంటివి నా మాటలు ^♥^
^♥^ వేసవి సాయంకాలంలోంచి పరుచుకొన్న మల్లెల పరిమళం నా స్నేహం ^♥^
నన్ను అర్ధం చేసుకోడానికి చాలా టైమ్ పడుతుంది . మొదటిసారి చూస్తే వీడెంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంది . అలవాటయిన కొద్దీ మంచోడేమో అనిపిస్తాను

Monday, October 13, 2008

హృది తలుపు

నిరాశ నిస్పృహలతో నేను నిస్తేజమైన వేళ..
ఆశలా నవ్వించింది నీ తలపు,

నిష్ఫల ఎండమావులకై పరుగు తీసిన వేళ..
సెలయేరై సేదతీర్చింది నీ పిలుపు,

ఆశయ సాగర మధనంలో నేను అలసిన వేళ..
అమృత హస్తమై ఆదరించింది నీ వలపు,

జీవన పద్మవ్యూహంలో దారులన్ని మూసుకుపోయిన వేళ..
ఆప్యాయంగా ఆదరించింది నీ హృది తలుపు !!!

అతడి ప్రియురాలు (Telugu Version of French Novel 'Was it a dream')

పెద్దదిగా చదవటానికి కథ మీద క్లిక్ చెయండి
ఆధారం : ఫ్రెంచి నవల 'వాజ్ ఇట్ ఎ డ్రీం'





Thursday, October 9, 2008

రాఘవ M.B.B.S

రాఘవ M.B.B.S కాగానే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ముందు పేషెంట్ కళ్ళు, నాలుక, చివరగా చెవులు చూసి ..
ఓ.కె .. టార్చ్ బాటరీ బాగానే పని చేస్తుంది అని డిసైడ్ చేసాడు.

మొబైల్ రీచార్జ్

సురేష్ : మా ఫ్రెండ్స్ అందరి మొబైల్స్ దొంగిలించింది ఒకే అమ్మాయి ..
రాజేష్ : అది నీకెలా తెలుసు ?
సురేష్ : చాలా సింపుల్ .. నేను ఎవరికి ఫొన్ చేసినా ఆ అమ్మాయే ఫోన్ లిఫ్ట్ చేసి 'దయ చేసి మీ మొబైల్ ని రీచార్జ్ చేసుకొండి ' అంటుంది.

వినయ్ B.A-M.A

వినయ్ భార్య చనిపోయింది. వెంటనే తన పేరు వినయ్B.A (Bachelor Again) అని మార్చుకొన్నాడు.
కొన్ని రోజుల తర్వాత అతను మళ్ళీ పెళ్ళి చేసుకొన్నాడు ... తన పేరు ఏమి పెట్టుకున్నాడో వూహించండి ?
వినయ్M.A (Married Again)

Monday, October 6, 2008

జీవిత స్మృతులు

జీవితంలో కొందరు వ్యక్తులు నీలో భాగం.
నువ్వు కావాలని వాళ్ళని దూరం చేసుకొన్నా..వాళ్ళని కోల్పోవు.
ఎందుకంటే వాళ్ళతో గడిపిన క్షణాలు నీ స్మృతులలో ఎప్పుడు నిలిచే వుంటాయి.

ప్రేమ-అదృష్టం

నువ్వు అదృష్టాన్ని పోగొట్టుకొంటే మళ్ళీ తిరిగి రాకపోవచ్చు..
కానీ నువ్వు పోగొట్టుకొన్న ప్రేమ మాత్రం నీకు తరచుగా ఎదురుపడుతూనే వుంటుంది.
దానికి ఎదురు వెళ్ళి అందుకొంటావో ..వదులుకొంటావో నిర్ణయించుకోవాల్సింది నీవే.

జీవితం

నువ్వు జీవితంలో చేసిన అపార్థాల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు.
అది జీవితం నిన్ను అపార్థం చేసుకొనే కంటే ముందు నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.

స్నేహం విలువ

తొలకరి వాన కురిస్తే మట్టిని అడుగు,సువాసన గొప్పదనం తెలుపుతుంది.
వర్షం వెంట వచ్చే హరివిల్లుని అడుగు,రంగుల అందాలని వర్ణిస్తుంది.
వసంతకాలంలో చిగురించే కొమ్మలని అడుగు,పచ్చదనం అంటే ఏంటో చెబుతుంది.
చిగురించిన కొమ్మల మాటున పాడే కొయిలని అడుగు,స్వరంలో కమ్మదనపు మాధుర్యాన్ని తెలుపుతుంది.
నీతో నా పరిచయాన్ని అడుగు,స్నేహం విలువను తెలుపుతుంది.

ఆశ

నువ్వు ప్రేమించే వాళ్ళ మీద ఎప్పుడూ ఆశ వదులుకోకు,
నీ హృదయంలో బాధకి ఎప్పుడూ వాళ్ళే కారణం కావొచ్చు...
కాని నీ హృదయ స్పందనలకి కూడా వాళ్ళే కారణం.
అది జ్ఞాపకం ఉంచుకో.

ప్రేమ-స్వార్థం

స్వార్థం లేని ప్రేమ కోసం ఎదురు చూసి కాలం వృధా చేసుకోకు,
తన అనే స్వార్థం లేని ప్రేమలో నిజాయితీ కూడా వుండదు.

స్నేహం

కలల ప్రయాణం మెలుకువ వరకు
అలల ప్రయాణం తీరం వరకు
ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకు
స్నేహం ప్రయాణం జీవితాంతం వరకు
ఏమంటావు నేస్తం ???

మనసున వున్నది

ప్రవహించే అమౄతానివో...
మమత అనే అద్భుత అనుబంధానికి అంకురానివో...
మనసు పాడే సుమధుర గీతానికి పల్లవివో...
మనసు అనే వేదికపై వయసు వేసే నౄత్యానివో...
వయసు వేసే నౄత్యానికే ఓ చక్కటి అభినయానివో...
జ్ఞాపకమను వేదికపై చెలరేగిన అలల తాకిడివో...
వెల్లువై తీరాన్నిచేరి అలసిపోయిన కడలి కెరటానివో...
ఊహ అనే మహాసముద్రమో ఎగసిపడుతున్న అల నీవో..
స్వప్నమను నందన వనంలో నేను కట్టుకున్న సౌధానివో...
మమకార మను పూతోటలో సుగంధాలు వెదజల్లే పారిజాతానివో...
అలంకారం అను హారంలో పొందికగా ఒదిగిపొయిన మణిపూసవో...

చెలిమి అనీ పేరుతో నీవు కోరే చేయూతకు నేను ఎల్లపుడూ సిద్ధం.
మైత్రి అనే మరోపేరుతోనైనా దరికిచేరితే కలిసి పయనిద్ధాం.
నిర్వచనం లేని ప్రేమకి కుడా ఓ అందమైన అర్ధాన్నందించిన ఓ స్నేహమా .... అంతేలేని నీ స్వరాజ్యంలో నాకు కూడాకాసింత చోటు కల్పించవూ....

Sunday, September 14, 2008

తెలంగాణ Windows

నువ్వు నాకు నచ్చావ్(Software Version)

పెద్దదిగా చూడటానికి బొమ్మ మీద క్లిక్ చెయ్యండి

సాఫ్ట్ వేర్ కవిత (Software Poetry)


అలలకి అలుపు లేదు,
శిలలకి చూపు లేదు,
కలలకి రూపు లేదు,
వూహలకి అంతం లేదు,
మౌనానికి భాష లేదు,
నాకు పని లేదు,
నీకు పని రాదు,
మనకి Hike రాదు.

Wednesday, July 23, 2008

శర్మ గారి డ్రైవర్

శర్మ : నీకు Driverగా ఉద్యోగం ఇస్తున్నాను, STARTING salary Rs.2000/-, సరిపోతుందా !
శెట్టి : మీరు చాలా మంచి వారు సార్ ... STARTING salary బాగానే వుంది,మరి DRIVING salary ఎంతిస్తారు ?


శర్మ : ఆ ..

బిల్ గేట్స్ ఇంటర్వూ - తెలుగోడి దెబ్బ

ఒక సారి Bill Gates ఇంటర్వూ పెట్టాడు.10000 మంది హాజరయ్యారు.వాళ్ళలో మన ఆంధ్రా నుంచి పంతులు గారు కూడా వున్నారు.

మొదటి ప్రశ్నగా జావా(JAVA) రాని వాళ్ళని Bill Gates వెళ్ళిపొమ్మన్నాడు.2000 మంది వెళ్ళిపోయారు.వచ్చని చెప్తే పోయెదేమి లేదు కదా అని మన పంతులు గారు కదలలేదు.

రెండవ ప్రశ్నగా Project Management లో అనుభవం లేని వాళ్ళని వెళ్ళిపొమ్మన్నాడు.మళ్ళీ 2000 మంది వెళ్ళిపోయారు.అనుభవం వుందని చెప్తే పోయెదేమి లేదు కదా అని మన పంతులు గారు కదలలేదు.

మూడవ ప్రశ్నగా విదేశీ అనుభవం(Onsite Experince) లేని వాళ్ళని వెళ్ళిపొమ్మన్నాడు.4000 మంది వెళ్ళిపోయారు. మనం M.S చేసింది అక్కడే కదా Passport అడిగితే అది చూపిద్దాంలే అని పంతులు గారు ఇప్పుడు కూడా కదలలేదు.

నాలుగవ ప్రశ్నగా జపనీస్,జర్మన్(Japaneese & German) భాషలలో నైపుణ్యం లేని వాళ్ళని వెళ్ళిపొమ్మన్నాడు.1998 మంది వెళ్ళిపోయారు.ఇంక ఇద్దరే మిగిలారు.మాట్లాడమన్నప్పుడు చూద్దాంలే అని పంతులు గారు లేవలేదు.

Bill Gates మిగిలిన ఇద్దరి వైపు తిరిగి మీరు జపనీస్,జర్మన్ భాషలలో మాట్లాడండి అన్నాడు.
పంతులు గారు పక్కనున్న వ్యక్తి వైపు తిరిగి ప్రశాంతంగా 'బాబు...మీరు ఎలా వున్నారు' అన్నాడు.పక్కనున్న వ్యక్తి అంతే ప్రశాంతంగా ' నేను బాగానే వున్నాను బాబూ ' అన్నాడు. ఇప్పుడు పక్కనున్న శెట్టి గారి దెబ్బకి ఆశ్చర్యపోవడం మన పంతులు గారి వంతయింది.

అదీ మన తెలుగోడి దెబ్బంటే ! (Great Andhra)

ప్రొఫెసర్ రావ్

ప్రొఫెసర్ రావ్ గారు ఒక సారి మెడికల్ స్టూడెంట్స్ కి ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు .. యుటెరస్(గర్భసంచి) చూపించి అది ఏంటో కనుక్కోమని స్టూడెంట్స్ ని అడిగారు. స్టూడెంట్స్ ఎవరూ చెప్పలేకపోయారు..
సరే అని ఒక స్టూడెంట్ ని పిలిచి ..నీకు ఒక క్లూ ఇస్తాను అని .. ఇది మేడంకి వుంది ..నాకు లేదు అని పక్కన వున్న మేడంని చూపించారు ..
ఆ స్టూడెంట్ వెంటనే తడుముకోకుండా .. మెదడు సార్ ..అన్నాడు ..
(ఇంక వేరే చెప్పాలా... ఆ స్టూడెంట్ ఎగ్జాం ఫెయిల్ అయ్యాడు అని)

Tuesday, July 22, 2008

సురేష్,రాజేష్ ATMకి వెళ్ళారు
సురేష్ : హ..హ !! నీ పాస్ వర్డ్ నాకు తెలిసిపోయింది గా.. **** .
రాజేష్ : హహ్హహ్హ .. పిచ్చోడా..నువ్వు కనుక్కోలేకపోయావ్ .. అది **** కాదు 1358 :)
లాయర్ రాజేష్ తో : గీత మీద చెయ్యి వేసి జరిగింది చెప్పు ...
రాజేష్ : సీత మీద చెయ్యివేసినందుకే కోర్టుకి వచ్చాను ..మళ్ళీ గీత మీద చెయ్యి వెయ్యాలా !!
లాయర్ : ఆ ....
వినయ్(యజమాని) : అరేయ్ రావు .. వెళ్ళి మొక్కలకి నీళ్ళు పెట్టు
రావు (పనివాడు) : వర్షం పడుతుందండి ..అయ్యగారు
వినయ్(యజమాని) : సాకులు చెప్పటం మాని వెళ్ళి గొడుగు వేసుకొని పెట్టురా వెధవా

Total Pageviews