Thursday, May 31, 2012

గవర్నమెంట్ బుద్ధులు


"ఈ మధ్య మన చంటాడికి అన్ని మీ బుద్ధులే వస్తున్నాయండీ " అంది మంగ.

"ఏం చేస్తున్నాడు ?" ఆశ్చర్యంగా అడిగాడు గవర్నమెంట్ ఉద్యోగి అయిన అప్పారావు.


" లంచం ఇవ్వందే ఏ పని ఆఖరుకి భోజనం కూడా ఫ్రీ గా చెయ్యడం లేదు.పగటి పుట స్కూలులో బెంచీ ముందు కూర్చోని హాయిగా పడుకుంటునాడట. మాస్టారు ఏం అడిగినా తెలీదు తెలీదు అని విసుక్కుంటున్నాడట.ప్రోగ్రెస్ రిపోర్ట్ పై దొంగ సంతకాలు కూడా పెడుతున్నాదట " అసలు సంగతి చెప్పింది మంగ.

పెళ్ళి కష్టాలు


"ఇదివరకు వస పిట్టలా గడ గడ వాగుతుందే వాడివి. ఇప్పుడేమిటి సైలెంట్ గా వుంటున్నావు ?" ఆశ్చర్యంగా అడిగాడు వెంగళ్రావు.

" ఈ మధ్యనే బోలెడు కట్నం తీసుకొని పెళ్ళి చేసుకున్నాను. ఇంక పెళ్ళాం ముందు నోరు విప్పడం కూడానా నా బ్రతుకుకి ? అసలు సంగతి విచారం గా చెప్పాడు తాతారావు.

బ్యాంకు సంబంధం


"బ్యాంకు వాడి కూతురిని పెళ్ళి చేసుకోవడం చాలా తప్పయిందిరా !" విచారం గా అన్నాడు సూరి.
"ఏమయ్యింది ? మంచి కుటుంబం , బ్యాంకు సంబంధం , ఇక కట్న కానుకలకు లోటు వుండదని అంటూ ఎగిరి గంతేసి చేసుకున్నావుగా పెళ్ళి ?" అడిగాడు రాము.
" అంతా నా ఖర్మకు వచ్చింది.కట్నం గా ఇచ్చిన ప్రతీ వస్తువుపై గోపాలం గారి ఆర్ధిక సహాయంతో అని రాయించి మరీ ఇస్తున్నాడు మా మామగారు. ఇంటికి వచ్చే వాళ్ల ముందు తలెత్తుకోలేకపోతున్నాను" ఏడుపు ముఖం తో అసలు సంగతి చెప్పాడు సూరి.

ఎంత ప్రేమో ...


" నేనంటే నా భార్యకు ఈ మధ్య ఎంతో ఇష్టం పెరిగింది." గర్వంగా అన్నాడు రాజు
"ఎలా చెప్పగలవు ?" అడిగాడు గోపి.
"అర్ధ రాత్రి ఒంటి గంటకు ఇంటికి వస్తున్నా అంట్లు తోమేందుకు వేడి నీళ్ళు పెట్టి ఇస్తుంది.బొగ్గుపొడికి బదులు నిర్మా ఇవ్వడం మొదలు పెట్టింది.బట్టలు ఉతికెందుకు సబ్బులో నానేసి రెడిగా వుంచుతుంది. అన్నం తినదానికి నేనెంత కష్టపడతానో అని ఏమీ మిగల్చకుండా అని మొత్తం తినేసి గిన్నెలు ఖాళీ చెసేస్తుంది" అసలు సంగతి చెప్పాడు రాజు.

డాక్టర్ దైవాధీనం



" ఈ ఆపరేషన్ థియేటర్లో పూల దండ ఎందుకు పెట్టారు సార్ ?" ఆదుర్దాగా అడిగాడు చిన్నారావు.
" ప్రాక్టీస్ మొదలెట్టిన దగర్నుంచీ నేను చేస్తున్న మొదటి ఆపరేషను ఇది.సక్సెస్ అయితే దేవుడికి వేస్తాం. ఫెయిలయితే నీకు వేస్తాం" తాపీగా కళ్ళజోడు సవరించుకుంటూ అన్నాడు డాక్టర్ దైవాధీనం.

పచ్చడి బండ


ఎందుకే ఈ పచ్చడి బండను షో కేసులో పెట్టావు ? ఏమిటి దాని ప్రత్యేకత ? " అడిగింది రాజి.
" నేను కాపురానికి వచ్చిన వారం రోజుల లోనే ఈ పచ్చడి బండకు గుద్దుకొని పడిపోయే మా అత్తగారు టపా కట్టేసింది.నాకు అత్త పోరు లేకుండా చేసింది. అందుకే ఈ పచ్చడి బండ అంటే నాకెంతో ఇష్టం. దానిని అపురూపం గా దాచుకున్నాను." గర్వం గా చెప్పింది రేఖ.

Monday, May 28, 2012

ఓ తాగుబోతు ప్రేమలేఖ


 

ఒక తాగుబోతు ప్రేమలో పడ్డాడు.
అతను తన ప్రియురాలికి ఇలా లవ్ లెటర్ రాశాడు.

నీ మాట జిన్
నీ నవ్వు రమ్
నీ నడక వోడ్కా
నీ చూపు విస్కీ
నీ మెడ బీర్ బాటిల్


ఓ ప్యార్
నువ్వు నా పాలిట బార్

బెండకాయ కూర


"ఈ రోజు మీ ఇంట్లో బెండకాయ కూర చేశారు కదూ వదినా?"

"అరె! అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగారు?"

"రాత్రి మా దొడ్లో బెండకాయలు ఎవరో దంగవెధవలు కోసుకెళ్ళార్లే"

పుస్తకం


"అదేంట్రా... రెండూ ఒకే రకం పుస్తకాలెందుకు కొన్నావు?" గిరిని అడిగాడు శ్రీపతి.

"ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్లే అని రాసుంది. అందుకే రెండు కొన్నాను" చెప్పాడు గిరి.

కరెంట్


"కరెంటు పోయినా, క్యాండిల్ కూడా లేకుండా అంతా చీకట్లో అన్నయ్యగారు వంట ఎలా చేస్తున్నారు కాంతమ్మొదినా?" ఆశ్చర్యంగా అడిగింది పొరుగింటి అంజమ్మ.



"ఆయన ఫోటోగ్రాఫర్ కదా.... డార్క్ రూంలో పనిచెయ్యడం ఆయనకి అలవాటే" తేలికగా చెప్పింది కాంతమ్మ.

Sunday, May 27, 2012

బలి


"ఏవండోయ్... ఈ రోజు మన పళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది శ్వేత.


"ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి విరుస్తూ అన్నాడు వినయ్.

తొందరగా ..



డాక్టర్ ప్రకాశ్ దగ్గర ట్రీట్‍మెంట్ తీసుకుంటున్నాడు గోపాల్.

"మీరు నేను గాఢమైన మిత్రులం. ఫీజిచ్చి ఓ మంచి స్నేహితుణ్ణి అవమానించలేను. ఫ్రీగా సేవ చేయించుకోవడమూ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఎంతో కొంత అందేలా నా వీలునామాలో మార్పులు చేస్తా" చెప్పాడు గోపాల్.


"డబ్బు కాస్త త్వరగా అవసరం. ఓసారి ఆ ప్రిస్ర్కిప్షన్ ఇస్తారా? నేను కొద్దిగా మార్పులు చేస్తా" అన్నాడు డాక్టర్ ప్రకాశ్.

బాక్సింగ్


ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి.

"ఊ కొట్టు... కొట్టు.... దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి" అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి.
"మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?" అడిగాడు పక్కనున్న వ్యక్తి.
"కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్‌ని" చెప్పాడు దంతనాధం

చెక్కు

"రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్.
"ఎందుకండీ?" అన్నాడు చంద్రం.

"ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందట" అన్నాడు డాక్టర్.


"మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది" బదులిచ్చాడు చంద్రం.

నిద్ర పోయేముందు

డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి "ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి" అని అడిగాడు వాసు.

"రెండెందుకండీ?" అమాయకంగా అడిగాడు షాపువాడు.
"ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు. ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి.."

లక్ష్యం


లక్ష్యం లేని జీవితానికి లక్ష్యం వెదకడం కన్న , 
లక్ష్యం ఉన్న జీవితానికి దారి చూపడం మిన్న

కోరిక

"నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.

"వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి.

"ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా.

"బగ్గు"వద్గీత - బగ్గులు ఎందుకు వస్తాయంటే?


కలియుగాంతం ఆసన్నమయింది, బ్రహ్మ తర్వాత యుగానికి శ్రీకారం చుట్టడానికి ఈ సారి వెరైటీగా కంప్యూటర్ లో సృష్టి మొదలు పెడదాం అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా ప్రాక్టీస్ కోసం ఏదైనా సాప్ట్ వేర్ కంపనీ లో చేరదాం అని నిర్ణయించుకొన్నాడు. తనతో పాటు ఇంకొంత మంది దేవుళ్ళని కూడా ప్రాక్టీస్ కి అహ్వానించాడు.
బ్రహ్మ సాప్ట్ వేర్ డెవలపర్ గా జాయిన్ అయ్యాడు. సాప్ట్ వేర్ ని సృష్టించటం బ్రహ్మ పని. బ్రహ్మండంగా కోడింగ్ మొదలుపెట్టాడు. కాని అప్పుడప్పుడు అలవాటులో పొరపాటు గా బగ్గులు కూడా వచ్చేవి.
బ్రహ్మ సృష్టించిన బగ్గుల వల్ల ప్రాజెక్ట్ కేమి సమస్యలు రాకుండ కాపాడడం, స్థితి కారకుడైన విష్ణువు పని కాబట్టి విష్ణు మూర్తి బ్రహ్మ కి టీం లీడర్ గా జాయిన్ అయిపోయాడు.
లయ కారకుడైన మహేశ్వరుడు కూడా టెక్నికల్ డైరెక్టర్ లాగా జాయిన్ అయ్యి బ్రహ్మ, విష్ణువులు సృష్టించి, కాపాడుతూన్న (మెయింటైన్ చేస్తున్న ) ప్రాజెక్ట్ లన్ని లయం(స్క్రాప్) చేస్తూ ఉండెవాడు. పొద్దున్న "C" లో చేసిన ప్రాజెక్ట్ ని స్క్రాప్ చేసి సాయంత్రం "C++" లో చేయమనే వాడు. తర్వాత రోజు దానిని స్క్రాప్ చేసి "java" లో చేయమంటూ తన ధర్మాన్ని నిర్వర్తించేవాడు.
ఈ రకం గా ప్రాజెక్ట్ లన్నీ స్క్రాప్ అవడం తో విసుగు చెందిన విష్ణు మూర్తి, బాగా ఆలోచించి ఇంకా కొంతమందిని టీం లో పెట్టుకుని ఒక్కక్కరి చేత ఒక్కో టెక్నాలజీ లో ప్రాజెక్ట్ డెవలప్ చేయించి ఈ సారి అయినా ప్రాజెక్ట్ "OK" చేయించుకోవలని అనుకున్నాడు. వెంటనే కృష్ణావతారం లో తన అనుంగు మితృడైన అర్జునుడిని, అర్జునుడి కన్నా ప్రతిభా పాటవాలు కల ఏకలవ్యుడిని టీం లో జాయిన్ చేసుకున్నాడు.
ఏకలవ్యుడు ఏ పని ఇచ్చినా తన శక్తి సామర్ధ్యాలతో వెంటనే పూర్తి చేసేసేవాడు. ఒక వేళ తనకి ఆ టెక్నాలజీ రాకున్నా, ఆ టెక్నాలజీని గురు ముఖంగా నేర్చుకోకపొయినా మనసులో గురువు గారిని ధ్యానించుకొని, గూగుల్ లో సెర్చ్ కొట్టి ప్రాక్టీస్ చేసి నేర్చేసుకొనేవాడు(కాపీ పేస్ట్ చేసేవాడు). కాని పాపం అర్జునుడు అలా కాదు. గురు ముఖంగా విననిదే ఏ టెక్నాలజీ నేర్చుకొలేకపోయెవాడు.
ఒక సారి అర్జునుడు చేసిన కోడ్ లో కుప్పలు తెప్పలు గా బగ్గులు వచ్చాయి. సాయంత్రానికి అన్ని బగ్గులు ఫిక్స్ చేయాలని విష్ణు మూర్తి డెడ్ లైన్ ఇచ్చి వెళ్ళాడు. అర్జునుడు మహా భారత యుధ్ధం లో కౌరవ సేన లా ఉన్న బగ్గులని చూసాడు. భయపడ్డాడు, విలపించాడు. అస్త్ర సన్యాసం (రాజీనామా) చేస్తున్నాని ప్రకటించాడు.
అర్జునుడి మాటలు విన్న విష్ణు మూర్తి వెంటనే కృష్ణావతారం లోకి మారిపోయి
"అర్జునా !
బగ్గు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య నాయనా!
బగ్గు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము. అది అగ్నిచే కాల్చబడదు. నీటిచే తడుపడదు. కోడు చే ఫిక్స్ చేయబడదు.!
మానవుడు ఒక వస్త్రాన్ని వదలి వేరొక వస్త్రాన్ని ధరించినట్టు బగ్గు ఒక రూపాన్ని వదలి వేరొక రూపాన్ని ధరిస్తుంది.
నువ్వు ఏం బగ్గు సృష్టించావని నీవు బాధ పడుతున్నావు. ఈ రోజు నీకు అసైన్ చేసిన బగ్గు నిన్న వేరొకరికి అసైన్ కాలేదా, రేపు వేరొకరికి అసైన్ కాదా?"
అని సాప్ట్ వేర్ జీవిత (లైఫ్ సైకిల్) పరమార్ధాన్ని వివరించ గానే దుఃఖాన్ని విడచి కార్యొన్ముఖుడై బగ్గులన్ని ఫిక్స్ చేసాడు.
అప్పటి నుంచి సాప్ట్ వేర్ ఉద్యోగులందరు తమ తమ స్థానాలలో త్రిమూర్తులు, అర్జునుడు, ఏకలవ్యుడు ఏర్పరిచిన సాంప్రదాయాలని పాటిస్తూ బగ్గులని ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుస్తునే ఉన్నారు.
గమనిక : ఈ కథ పది సార్లు పారాయణ చేసిన వారికి పది బగ్గులు తక్కువ వస్తాయి !!!

సీతా - రామారావు


మొగుడూ పెళ్ళాళయిన సీతా, రామారావు ఒకరోజు తీవ్రం గా గొడవ పడ్దారు. ఎప్పటికీ మొగుడు కాళ్ళు పట్టుకోకపోవడం వలన గబ గబ కొన్ని బట్టలను సర్దేసి బయటకు నడవబోతోంది సీత.
" ఎక్కడికి పోతున్నావు ? " అడిగాడు రామారావు.
" నరకానికి" విసురుగా సమాధానమిచ్చింది సీత.
అయితే నిన్ను నాకు తగిలించి అక్కడకు పోయిన నా అత్తమామలకు నా నమస్కారాలు చెప్పు" వ్యంగ్యం గా అన్నాడు రామారావు.

వంశ పారంపర్యం



"వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.

"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.

Total Pageviews