Friday, July 6, 2012

అలా రాశానా !



హైదరాబాద్ లో ఉద్యోగానికి ఆంధ్రా నుంచి, రాయలసీమ నుంచి, తెలంగాణా నుంచి ముగ్గురు వెంగళప్పలు అర్హత పొందారు. రాత పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలు చూసి రాయలసీమ వెంగళప్ప , ఇలాంటి పనులు మనం చెయ్యలేములే అని మధ్యలోనే వెళ్ళిపోయాడు.మిగతా ఇద్దరు పరీక్ష రాసి ఉద్యోగం ఎవరికి వస్తుందో అని ఎదురుచూస్తున్నారు.


కొంతసేపటి తర్వాత మేనేజర్ వచ్చి , "మీ ఇద్దరు 9 ప్రశ్నలకి సరిగ్గా సమాధానం రాశారు.. ఇద్దరూ ఒకే ప్రశ్నకి తప్పు సమాధానం రాశారు.ఈ ఉద్యోగం ఆంధ్రా వెంగళప్పకి ఇద్దామని నిర్ణయించుకొన్నాం" అని చెప్పాడు.  



తెలంగాణ వెంగళప్ప : అలా ఎలా కుదురుతుంది ? ఇద్దరం ఒకే ప్రశ్నకి తప్పు రాశాం. ఇది హైదరాబాద్ ఉద్యోగం కాబట్టి లెక్క ప్రకారం నాకే రావాలి అన్నాడు.


మేనేజర్ : మేము ఉద్యోగం ఇస్తుంది మీరు రాసిన సరయిన సమాధానాల్ని బట్టి కాదు, మీరు తప్పు రాసిన ప్రశ్న ఆధారంగా నిర్ణయించాం.


తెలంగాణ వెంగళప్ప : ఇద్దరం ఒకే తప్పు చేసాం అంటున్నారు , దాన్ని బట్టి ఎలా నిర్ణయిస్తారు ?


మేనేజర్ : చాలా సులభం ! తప్పు రాసిన ప్రశ్నకి ఆంధ్రా వెంగళప్ప 'నాకు తెలియదు' అని రాశాడు. నువ్వు 'నాకు కూడా తెలియదు' అని రాశావ్. 










డాక్టర్ పేరు


డాక్టర్ జగన్నాధం కొత్తగా హాస్పిటల్ మొదలుపెట్టి , బయట బోర్డ్ మీద పేరు రాయించడానికి వెంగళప్ప అనే పెయింటర్ కి పని అప్పగించాడు.


డాక్టర్ : బోర్డ్ మీద "డా ! జగన్నాధం - Psychotherapist" అని రాయి.
వెంగళప్ప : సరే సార్ !


కొంతసేపటి తర్వాత డాక్టర్ వచ్చి చూస్తే ఇలా వుంది "డా ! జగన్నాధం - Psycho the rapist" 

Thursday, July 5, 2012

నీకూ కుక్కకూ తేడా లేదురా...!!



జంబు: డుంబూ... నీకు ఈత వచ్చారా...

డుంబు: రాదు రా...

జంబు: నీకన్నా కుక్క నయం కదరా... చాలా బాగా ఈదుతుంది

డుంబు: మరి నీకు వచ్చా రా...

జంబు: ఓ.. బ్రహ్మాండంగా వచ్చు...

డుంబు: ఐతే నీకూ కుక్కకీ పెద్దగా తేడా లేదన్నమాట.

Monday, July 2, 2012

వినాయక న్యాయం




కొంతమంది భక్తులు పడవలో వెళ్తుండగా , పడవ ప్రమాదానికి గురయి మునిగిపోసాగింది ..


వాళ్ళు కళ్ళు మూసుకుని వినాయకుడిని ప్రార్థించారు.


వినాయకుడు ప్రత్యక్షం అయ్యి నాట్యం చెయ్యసాగాడు..


భక్తులు : "స్వామీ..మీరు వచ్చి కాపాడతారనుకొంటే , మమ్మల్ని ఈ పరిస్థిథిలో చూసి ఆనందంతో నాట్యం చేస్తున్నారా.. ఇదేమి న్యయం స్వామి" ? 


వినాయకుడు :" వినాయకచవితి తర్వాత మీరు నన్ను నీళ్ళలో వేసి డాన్సులు చెయ్యలేదా.. మీకొక న్యాయం, నాకొక న్యాయమా"? 

పక్కింటి అమ్మాయి






తండ్రి : పక్కింటి అమ్మాయిని చూడరా.. 1st క్లాస్ లో ఎలా పాస్ అయ్యిందో ..


కొడుకు :దాన్ని అలా చూసే నేను ఫెయిల్ అయ్యింది ..


తండ్రి : ఆ...

లిప్ స్టిక్ .. ఫెవీ స్టిక్




తండ్రి ఏంట్రా చింటూ..ఎప్పుడూ లేనిది మమ్మీ మౌనంగా కూర్చుంది ?

చింటూ : మమ్మీ లిప్ స్టిక్ అడిగితే ఫెవీ స్టిక్ ఇచ్చాను..




Total Pageviews