Wednesday, July 23, 2008

బిల్ గేట్స్ ఇంటర్వూ - తెలుగోడి దెబ్బ

ఒక సారి Bill Gates ఇంటర్వూ పెట్టాడు.10000 మంది హాజరయ్యారు.వాళ్ళలో మన ఆంధ్రా నుంచి పంతులు గారు కూడా వున్నారు.

మొదటి ప్రశ్నగా జావా(JAVA) రాని వాళ్ళని Bill Gates వెళ్ళిపొమ్మన్నాడు.2000 మంది వెళ్ళిపోయారు.వచ్చని చెప్తే పోయెదేమి లేదు కదా అని మన పంతులు గారు కదలలేదు.

రెండవ ప్రశ్నగా Project Management లో అనుభవం లేని వాళ్ళని వెళ్ళిపొమ్మన్నాడు.మళ్ళీ 2000 మంది వెళ్ళిపోయారు.అనుభవం వుందని చెప్తే పోయెదేమి లేదు కదా అని మన పంతులు గారు కదలలేదు.

మూడవ ప్రశ్నగా విదేశీ అనుభవం(Onsite Experince) లేని వాళ్ళని వెళ్ళిపొమ్మన్నాడు.4000 మంది వెళ్ళిపోయారు. మనం M.S చేసింది అక్కడే కదా Passport అడిగితే అది చూపిద్దాంలే అని పంతులు గారు ఇప్పుడు కూడా కదలలేదు.

నాలుగవ ప్రశ్నగా జపనీస్,జర్మన్(Japaneese & German) భాషలలో నైపుణ్యం లేని వాళ్ళని వెళ్ళిపొమ్మన్నాడు.1998 మంది వెళ్ళిపోయారు.ఇంక ఇద్దరే మిగిలారు.మాట్లాడమన్నప్పుడు చూద్దాంలే అని పంతులు గారు లేవలేదు.

Bill Gates మిగిలిన ఇద్దరి వైపు తిరిగి మీరు జపనీస్,జర్మన్ భాషలలో మాట్లాడండి అన్నాడు.
పంతులు గారు పక్కనున్న వ్యక్తి వైపు తిరిగి ప్రశాంతంగా 'బాబు...మీరు ఎలా వున్నారు' అన్నాడు.పక్కనున్న వ్యక్తి అంతే ప్రశాంతంగా ' నేను బాగానే వున్నాను బాబూ ' అన్నాడు. ఇప్పుడు పక్కనున్న శెట్టి గారి దెబ్బకి ఆశ్చర్యపోవడం మన పంతులు గారి వంతయింది.

అదీ మన తెలుగోడి దెబ్బంటే ! (Great Andhra)

No comments:

Total Pageviews