నిరాశ నిస్పృహలతో నేను నిస్తేజమైన వేళ..
ఆశలా నవ్వించింది నీ తలపు,
నిష్ఫల ఎండమావులకై పరుగు తీసిన వేళ..
సెలయేరై సేదతీర్చింది నీ పిలుపు,
ఆశయ సాగర మధనంలో నేను అలసిన వేళ..
అమృత హస్తమై ఆదరించింది నీ వలపు,
జీవన పద్మవ్యూహంలో దారులన్ని మూసుకుపోయిన వేళ..
ఆప్యాయంగా ఆదరించింది నీ హృది తలుపు !!!
Monday, October 13, 2008
Thursday, October 9, 2008
రాఘవ M.B.B.S
రాఘవ M.B.B.S కాగానే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ముందు పేషెంట్ కళ్ళు, నాలుక, చివరగా చెవులు చూసి ..
ఓ.కె .. టార్చ్ బాటరీ బాగానే పని చేస్తుంది అని డిసైడ్ చేసాడు.

Labels:
హాస్యం
మొబైల్ రీచార్జ్
సురేష్ : మా ఫ్రెండ్స్ అందరి మొబైల్స్ దొంగిలించింది ఒకే అమ్మాయి ..
రాజేష్ : అది నీకెలా తెలుసు ?
సురేష్ : చాలా సింపుల్ .. నేను ఎవరికి ఫొన్ చేసినా ఆ అమ్మాయే ఫోన్ లిఫ్ట్ చేసి 'దయ చేసి మీ మొబైల్ ని రీచార్జ్ చేసుకొండి ' అంటుంది.

వినయ్ B.A-M.A
వినయ్ భార్య చనిపోయింది. వెంటనే తన పేరు వినయ్B.A (Bachelor Again) అని మార్చుకొన్నాడు.
కొన్ని రోజుల తర్వాత అతను మళ్ళీ పెళ్ళి చేసుకొన్నాడు ... తన పేరు ఏమి పెట్టుకున్నాడో వూహించండి ?
వినయ్M.A (Married Again)

Monday, October 6, 2008
జీవిత స్మృతులు
జీవితంలో కొందరు వ్యక్తులు నీలో భాగం.
నువ్వు కావాలని వాళ్ళని దూరం చేసుకొన్నా..వాళ్ళని కోల్పోవు.
ఎందుకంటే వాళ్ళతో గడిపిన క్షణాలు నీ స్మృతులలో ఎప్పుడు నిలిచే వుంటాయి.

ఒక చిన్న మాట
ప్రేమ-అదృష్టం
నువ్వు అదృష్టాన్ని పోగొట్టుకొంటే మళ్ళీ తిరిగి రాకపోవచ్చు..
కానీ నువ్వు పోగొట్టుకొన్న ప్రేమ మాత్రం నీకు తరచుగా ఎదురుపడుతూనే వుంటుంది.
దానికి ఎదురు వెళ్ళి అందుకొంటావో ..వదులుకొంటావో నిర్ణయించుకోవాల్సింది నీవే.
కానీ నువ్వు పోగొట్టుకొన్న ప్రేమ మాత్రం నీకు తరచుగా ఎదురుపడుతూనే వుంటుంది.
దానికి ఎదురు వెళ్ళి అందుకొంటావో ..వదులుకొంటావో నిర్ణయించుకోవాల్సింది నీవే.
Labels:
ఒక చిన్న మాట
జీవితం
నువ్వు జీవితంలో చేసిన అపార్థాల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు.
అది జీవితం నిన్ను అపార్థం చేసుకొనే కంటే ముందు నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.
అది జీవితం నిన్ను అపార్థం చేసుకొనే కంటే ముందు నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.
Labels:
ఒక చిన్న మాట
స్నేహం విలువ
తొలకరి వాన కురిస్తే మట్టిని అడుగు,సువాసన గొప్పదనం తెలుపుతుంది.
వర్షం వెంట వచ్చే హరివిల్లుని అడుగు,రంగుల అందాలని వర్ణిస్తుంది.
వసంతకాలంలో చిగురించే కొమ్మలని అడుగు,పచ్చదనం అంటే ఏంటో చెబుతుంది.
చిగురించిన కొమ్మల మాటున పాడే కొయిలని అడుగు,స్వరంలో కమ్మదనపు మాధుర్యాన్ని తెలుపుతుంది.
నీతో నా పరిచయాన్ని అడుగు,స్నేహం విలువను తెలుపుతుంది.

కవితలు
ఆశ
నువ్వు ప్రేమించే వాళ్ళ మీద ఎప్పుడూ ఆశ వదులుకోకు,
నీ హృదయంలో బాధకి ఎప్పుడూ వాళ్ళే కారణం కావొచ్చు...
కాని నీ హృదయ స్పందనలకి కూడా వాళ్ళే కారణం.
అది జ్ఞాపకం ఉంచుకో.
నీ హృదయంలో బాధకి ఎప్పుడూ వాళ్ళే కారణం కావొచ్చు...
కాని నీ హృదయ స్పందనలకి కూడా వాళ్ళే కారణం.
అది జ్ఞాపకం ఉంచుకో.
Labels:
ఒక చిన్న మాట
ప్రేమ-స్వార్థం
స్వార్థం లేని ప్రేమ కోసం ఎదురు చూసి కాలం వృధా చేసుకోకు,
తన అనే స్వార్థం లేని ప్రేమలో నిజాయితీ కూడా వుండదు.
తన అనే స్వార్థం లేని ప్రేమలో నిజాయితీ కూడా వుండదు.
Labels:
ఒక చిన్న మాట
మనసున వున్నది
ప్రవహించే అమౄతానివో...
మమత అనే అద్భుత అనుబంధానికి అంకురానివో...
మనసు పాడే సుమధుర గీతానికి పల్లవివో...
మనసు అనే వేదికపై వయసు వేసే నౄత్యానివో...
వయసు వేసే నౄత్యానికే ఓ చక్కటి అభినయానివో...
జ్ఞాపకమను వేదికపై చెలరేగిన అలల తాకిడివో...
వెల్లువై తీరాన్నిచేరి అలసిపోయిన కడలి కెరటానివో...
ఊహ అనే మహాసముద్రమో ఎగసిపడుతున్న అల నీవో..
స్వప్నమను నందన వనంలో నేను కట్టుకున్న సౌధానివో...
మమకార మను పూతోటలో సుగంధాలు వెదజల్లే పారిజాతానివో...
అలంకారం అను హారంలో పొందికగా ఒదిగిపొయిన మణిపూసవో...
చెలిమి అనీ పేరుతో నీవు కోరే చేయూతకు నేను ఎల్లపుడూ సిద్ధం.
మైత్రి అనే మరోపేరుతోనైనా దరికిచేరితే కలిసి పయనిద్ధాం.
నిర్వచనం లేని ప్రేమకి కుడా ఓ అందమైన అర్ధాన్నందించిన ఓ స్నేహమా .... అంతేలేని నీ స్వరాజ్యంలో నాకు కూడాకాసింత చోటు కల్పించవూ....

Subscribe to:
Posts (Atom)