Monday, October 6, 2008

స్నేహం విలువ

తొలకరి వాన కురిస్తే మట్టిని అడుగు,సువాసన గొప్పదనం తెలుపుతుంది.
వర్షం వెంట వచ్చే హరివిల్లుని అడుగు,రంగుల అందాలని వర్ణిస్తుంది.
వసంతకాలంలో చిగురించే కొమ్మలని అడుగు,పచ్చదనం అంటే ఏంటో చెబుతుంది.
చిగురించిన కొమ్మల మాటున పాడే కొయిలని అడుగు,స్వరంలో కమ్మదనపు మాధుర్యాన్ని తెలుపుతుంది.
నీతో నా పరిచయాన్ని అడుగు,స్నేహం విలువను తెలుపుతుంది.

No comments:

Total Pageviews