నిరాశ నిస్పృహలతో నేను నిస్తేజమైన వేళ..
ఆశలా నవ్వించింది నీ తలపు,
నిష్ఫల ఎండమావులకై పరుగు తీసిన వేళ..
సెలయేరై సేదతీర్చింది నీ పిలుపు,
ఆశయ సాగర మధనంలో నేను అలసిన వేళ..
అమృత హస్తమై ఆదరించింది నీ వలపు,
జీవన పద్మవ్యూహంలో దారులన్ని మూసుకుపోయిన వేళ..
ఆప్యాయంగా ఆదరించింది నీ హృది తలుపు !!!
Monday, October 13, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment