"బ్యాంకు వాడి కూతురిని పెళ్ళి చేసుకోవడం చాలా తప్పయిందిరా !" విచారం గా అన్నాడు సూరి.
"ఏమయ్యింది ? మంచి కుటుంబం , బ్యాంకు సంబంధం , ఇక కట్న కానుకలకు లోటు వుండదని అంటూ ఎగిరి గంతేసి చేసుకున్నావుగా పెళ్ళి ?" అడిగాడు రాము.
" అంతా నా ఖర్మకు వచ్చింది.కట్నం గా ఇచ్చిన ప్రతీ వస్తువుపై గోపాలం గారి ఆర్ధిక సహాయంతో అని రాయించి మరీ ఇస్తున్నాడు మా మామగారు. ఇంటికి వచ్చే వాళ్ల ముందు తలెత్తుకోలేకపోతున్నాను" ఏడుపు ముఖం తో అసలు సంగతి చెప్పాడు సూరి.
No comments:
Post a Comment