Friday, July 6, 2012

అలా రాశానా !



హైదరాబాద్ లో ఉద్యోగానికి ఆంధ్రా నుంచి, రాయలసీమ నుంచి, తెలంగాణా నుంచి ముగ్గురు వెంగళప్పలు అర్హత పొందారు. రాత పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలు చూసి రాయలసీమ వెంగళప్ప , ఇలాంటి పనులు మనం చెయ్యలేములే అని మధ్యలోనే వెళ్ళిపోయాడు.మిగతా ఇద్దరు పరీక్ష రాసి ఉద్యోగం ఎవరికి వస్తుందో అని ఎదురుచూస్తున్నారు.


కొంతసేపటి తర్వాత మేనేజర్ వచ్చి , "మీ ఇద్దరు 9 ప్రశ్నలకి సరిగ్గా సమాధానం రాశారు.. ఇద్దరూ ఒకే ప్రశ్నకి తప్పు సమాధానం రాశారు.ఈ ఉద్యోగం ఆంధ్రా వెంగళప్పకి ఇద్దామని నిర్ణయించుకొన్నాం" అని చెప్పాడు.  



తెలంగాణ వెంగళప్ప : అలా ఎలా కుదురుతుంది ? ఇద్దరం ఒకే ప్రశ్నకి తప్పు రాశాం. ఇది హైదరాబాద్ ఉద్యోగం కాబట్టి లెక్క ప్రకారం నాకే రావాలి అన్నాడు.


మేనేజర్ : మేము ఉద్యోగం ఇస్తుంది మీరు రాసిన సరయిన సమాధానాల్ని బట్టి కాదు, మీరు తప్పు రాసిన ప్రశ్న ఆధారంగా నిర్ణయించాం.


తెలంగాణ వెంగళప్ప : ఇద్దరం ఒకే తప్పు చేసాం అంటున్నారు , దాన్ని బట్టి ఎలా నిర్ణయిస్తారు ?


మేనేజర్ : చాలా సులభం ! తప్పు రాసిన ప్రశ్నకి ఆంధ్రా వెంగళప్ప 'నాకు తెలియదు' అని రాశాడు. నువ్వు 'నాకు కూడా తెలియదు' అని రాశావ్. 










No comments:

Total Pageviews